రైతుకు కలిసొచ్చిన పుచ్చ
ABN , Publish Date - Mar 04 , 2026 | 09:04 AM
పుచ్చకయల ధరలు చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సంవత్సరం వీటి సాగు విస్తీర్ణం తగ్గడంతో మంచి డిమాండ్ వచ్చింది.
కిలో రూ.18 నుంచి రూ.20కి కొనుగోలు
గత సంత్సరం ఇదే రూ.6 నుంచి రూ.10
పెరిగిన ధరలతో వినియోగదారులు గగ్గోలు
తాడేపల్లిగూడెం మార్కెట్లో తమిళనాడు పుచ్చ
తాడేపల్లిగూడెం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పుచ్చకయల ధరలు (Watermelon Price) చూసి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సంవత్సరం వీటి సాగు విస్తీర్ణం తగ్గడంతో మంచి డిమాండ్ వచ్చింది. ఇటీవల తమిళనాడులో తుఫాన్ ప్రభావంతో తోటలు దెబ్బతిన్నాయి. గత సంవత్సరం పుచ్చకాయలకు సాగు ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది సాగు ఉన్నా తుఫాన్ దెబ్బతో తోటలు దెబ్బతినడంతో డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రంజాన్ మాసం జతకలిసింది. గతంలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ తక్కువగా ఉండేది. అలాంటిది ఈ ఏడాది రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది. తమిళనాడు నుంచి వచ్చే సారల పుచ్చకాయలకు విపరీతమైన డిమాండ్ మార్కెట్లో ఉంటుంది.
తీపి ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయలు తమిళనాడులో ఆరం బాకం, కొట్టాయం, తిరువెల్లూరు వంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా సాగుచేస్తుంటారు. ఇక్కడ నేల సారవంతంగా ఉండటంతో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ రైతులు ఎక్కువగా సారల పుచ్చకాయలనే పండిస్తారు. గత సంవత్సరం ఇక్కడ రైతులు వ్యాపారులకు కిలో రూ.6 నుంచి రూ.10 మధ్య అమ్మారు. ఈ ఏడాది ఇదే రకం పుచ్చకాయలు కిలో రూ.18 నుంచి రూ.20కు రైతులు హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీటిని తెచ్చిన హోల్‌సేల్ వ్యాపారులు రిటైలర్స్ కిలో రూ.23 నుంచి రూ.25కు విక్రయిస్తున్నారు. వీటిని రిటైలర్స్ వినియోగదారుకు కిలో రూ.30 నుంచి రూ.35కు అమ్ముతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News