విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. 8 మంది మృతి
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:30 PM
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈరోజు (సోమవారం) భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నం, జూన్8 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈరోజు (సోమవారం) భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోల్టెన్ మెటల్ ల్యాడల్ నుంచి బకెట్లు కుప్పకూలాయి. ల్యాడల్‌లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ప్రమాదస్థలిలో 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ యాజమాన్యం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. గాయపడిన కార్మికులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్లాంట్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ల్యాడల్‌లోని ద్రవ లోహం ఎందుకు కిందపడింది?, సాంకేతిక లోపమా? లేక భద్రతా ప్రమాణాల్లో ఏవైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అధికారిక నివేదిక వచ్చిన తర్వాతే గాయపడిన వారి సంఖ్య, మరణాల వివరాలు, ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest And Telangana News And National News
And Telugu News