విశాఖ సీఐఐ సమ్మిట్‌తో ఏపీకి రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు: రామ్మోహన్
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:57 PM
విశాఖకు సీఐఐ సమ్మిట్ కొత్త కాదని.. సమ్మిట్ ద్వారా ఏపీ బ్రాండ్ వాల్యూను ప్రమోట్ చేయగలిగామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖకు సీఐఐ సమ్మిట్ కొత్త కాదని.. సమ్మిట్ ద్వారా ఏపీ బ్రాండ్ వాల్యూను ప్రమోట్ చేయగలిగామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు (శనివారం) వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగని విధంగా విశాఖ సీఐఐ సమ్మిట్ జరిగిందని తెలిపారు. ఇంటర్ నేషనల్ స్టాండర్డ్‌తో సమ్మిట్‌ను నిర్వహించారని అన్నారు. సుమారు రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. వచ్చిన పెట్టుబడులను గ్రౌండ్ అయ్యేలా చేశారని చెప్పారు.
దేశంలో వంద రూపాయలు వస్తే.. ఏపీకి 25 రూపాయిలు వస్తున్నాయని కేంద్రమంత్రి అన్నారు. ఫలితంగా ఇక్కడి బిడ్డలకు ఉపాధి వస్తుందని చెప్పుకొచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను హబ్‌గా తయారు చేస్తున్నాని.. ప్రతిరోజూ విమాన సర్వీసులను పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇప్పుడున్న ఎయిర్ సర్వీస్‌తో పాటు కొత్త ఎయిర్ సర్వీస్‌లను తీసుకొస్తున్నామని తెలిపారు. విశాఖ- తిరుపతి, విశాఖ -విజయవాడకు విమానాలను పెంచామని అన్నారు.
తిరుపతి నుంచి గల్ఫ్‌కు విమాన సేవలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీలో చిన్న ఎయిర్‌పోర్టులు పెంచుతామని చెప్పారు. శ్రీకాకుళం, కుప్పం సైట్ క్లియరెన్స్ ఇచ్చామన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో 2024 కంటే ఎక్కువ ఓట్లు కూటమికి వస్తున్నాయన్నారు. శ్రీకాకుళం ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానని.. ప్రచారంలో పాల్గొంటున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మత్స్యకారుల సంక్షేమం.. ఆక్వా రంగ అభివృద్ధే ఏపీ ప్రగతి: చంద్రబాబు
రాజకీయాల్లో వీడ్కోలు ఉండదు.. మాజీ కార్పొరేటర్లకూ సమాన గౌరవం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Read Latest AP News And Telugu News