Share News

విశాఖలో విషాదం.. సముద్రంలో ఇద్దరి గల్లంతు

ABN , Publish Date - Nov 07 , 2026 | 03:38 PM

విశాఖపట్నంలోని గోకుల్ పార్క్ బీచ్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా ఎగిసిపడిన కెరటాల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయారు.

విశాఖలో విషాదం.. సముద్రంలో ఇద్దరి గల్లంతు
Visakhapatnam Beach Incident

విశాఖపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని గోకుల్ పార్క్ బీచ్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా ఎగిసిపడిన కెరటాల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరవాడ ప్రాంతం నుంచి వచ్చిన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు కలిసి గోకుల్ పార్క్ బీచ్‌కు వెళ్లారు. సరదాగా సముద్రంలో స్నానానికి దిగిన సమయంలో భారీ కెరటాలు ఐదుగురిని సముద్రంలోకి లాగేశాయి. వారు ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన లైఫ్ గార్డులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.


వెంటనే రంగంలోకి దిగిన లైఫ్ గార్డులు ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. అయితే మరో ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో బీచ్ వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రంలో కెరటాల ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులు నీటిలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు

ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు

పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:07 PM