స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం: ఏపీ టీడీపీ చీఫ్
ABN , Publish Date - Sep 11 , 2026 | 02:21 PM
పార్టీలోకి ఎవరు రావాలన్నా.. స్థానిక నాయకత్వం అంగీకరిస్తేనే వారిని తీసుకుంటామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీనుని స్థానిక నాయకత్వం ఆమోదంతోనే పార్టీలోకి తీసుకున్నామని ఆయన వివరించారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: పార్టీలోకి ఎవరు రావాలన్నా.. స్థానిక నాయకత్వం అంగీకరిస్తేనే వారిని తీసుకుంటామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీనుని స్థానిక నాయకత్వం ఆమోదంతోనే పార్టీలోకి తీసుకున్నామని ఆయన వివరించారు. శుక్రవారం విశాఖపట్నంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే నడవాలని అన్నారు. సముద్రంలో నదులు కలవవని.. నదులే సముద్రంలో కలవాలని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల విషయంలో కూటమి పార్టీలు కూర్చుని ఓ నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. స్థానిక సంస్థల్లో యువకుల సమర్ధతతోపాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీట్ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. రేపు (శనివారం) జిల్లా స్థాయిలో సమావేశం తర్వాత.. అసెంబ్లీ స్థాయి సమావేశాలు ఉంటాయని వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో అనేక అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. అయితే దీనిని కూడా కేసులు వేసి అడ్డుకోవాలనే గొడ్డలి పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలోని పార్టీలు కలిసి ఉండడాన్ని గొడ్డలి పార్టీలోని నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. ఫేక్ అకౌంట్లతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఆ ట్రాప్‌లో కూటమి నేతలు ఎవరూ పడవద్దని ఏపీ టీడీపీ చీఫ్ సూచించారు. కూటమిలో ఏ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన ఆ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అంతేకానీ నేరుగా ఎవరూ స్పందించొద్దని అన్నారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు బయటపడతాయని ఉద్దేశంతోనే.. డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గాజువాక ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని.. అందుకే స్పీకర్ డిజిటల్ సైన్ అమల్లోకి తీసుకొచ్చారని వివరించారు. అసెంబ్లీకి వచ్చి.. చర్చించి శాసనాలు చేసేందుకే తమకు పదవులు ఇచ్చారని అన్నారు. అలా రానప్పుడు ఆ పదవులకు ప్రయోజనం లేదని వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు చురకలంటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఫస్ట్: సీఎం చంద్రబాబు
లోకేశ్ సవాల్‌కు నేటికి స్పందించని జగన్: ఎంపీ కేశినేని చిన్ని
Read Latest AP News And Telangana News And International News And Telugu News