Share News

ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఫస్ట్: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:25 PM

ఫైల్స్ క్లియరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రెండో రోజు జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఫస్ట్: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 11: ఫైల్స్ క్లియరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రెండో రోజు జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చివరి స్థానంలో రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి ఉన్నారని చెప్పారు.


ఫైల్స్‌ క్లియరెన్స్‌కు మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ అధిక సమయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఇంప్రూవ్‌ కావాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కొందరు మంత్రులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.


అలాగే ఫైల్స్ క్లియర్ చేయడానికి ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ విభాగాల అధిపతులు (హెచ్‌వోడీలు), జిల్లా కలెక్టర్‌లు ఎన్ని రోజులు తీసుకుంటున్నారో కూడా సీఎం చంద్రబాబు వివరించారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో ఎక్కువ సమయం తీసుకుంటున్న వారిపై ఈ సందర్భంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


చాలా మంది కార్యదర్శులు రెండ్రోజుల్లో ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని, కొందరు హెచ్‌వోడీలు మాత్రం మూడ్రోజుల సమయం తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఫైళ్లను క్లియర్ చేయడానికి అన్ని రోజుల సమయం ఎందుకు పడుతోందో వివరణ తీసుకోవాలని ఈ సమావేశంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లోకేశ్ సవాల్‌కు నేటికి స్పందించని జగన్: ఎంపీ కేశినేని చిన్ని

కొవ్వూరు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిన పలు రైళ్ల రాకపోకలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 01:49 PM