Share News

లోకేశ్ సవాల్‌కు నేటికి స్పందించని జగన్: ఎంపీ కేశినేని చిన్ని

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:57 PM

కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా డీఎస్సీ పరీక్ష నిర్వహించిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. దీనిపై తప్పుడు ప్రచారం మానుకోవాంటూ పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఆయన హితవు పలికారు.

లోకేశ్ సవాల్‌కు నేటికి స్పందించని జగన్: ఎంపీ కేశినేని చిన్ని
VIjayawada MP Kesineni Chinni

విజయవాడ, సెప్టెంబర్ 11: కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా డీఎస్సీ పరీక్ష నిర్వహించిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. దీనిపై తప్పుడు ప్రచారం మానుకోవాంటూ పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఆయన హితవు పలికారు. మరో మూడు డీఎస్సీ‌లను మంత్రి లోకేశ్ నిర్వహించి తీరుతారని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో స్థానిక ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ బహిరంగ చర్చకు రెడీ అని సవాల్ చేస్తే.. దానిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంతవరకు స్పందించ లేదని అన్నారు. డీఎస్సీ ద్వారా16 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే ఓర్వలేక పోతున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. వైసీపీ నేతలు చెబుతున్న అబద్ధాలను ఎవరూ నమ్మరని.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.


సాక్షి పేప‌ర్‌లో రాసేది.. ఆ చానెల్‌లో చూపించే దానిలో ఏదీ నిజం ఉండదని అసహనం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు ఉండవని కూడా వాళ్లకి తెలియదన్నారు. స్పోర్ట్స్ కోటాలో కేటాయింపులు నేరుగా ఉంటాయని వివరించారు. మెరిట్ కోటా ప్రకారం ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. డీఎస్సీకి, ఎపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి వైసీపీ అధినేత వైఎస్ జగన్ అని వ్యంగ్యంగా అన్నారు. బాబాయికి గొడ్డలి పోటు వేసి.. గుండె పోటు అని అబద్ధాలు ప్రచారం చేసిన చరిత్ర జగన్‌దని చెప్పారు. ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగం చేస్తున్న రామకృష్ణకు డీఎస్సీలో ఉద్యోగం వచ్చిందని వివరించారు. అతడి విషయంలో జగన్ పత్రికలో అబద్ధాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సజీవ సాక్ష్యం రామకృష్ణ ఇక్కడే ఉన్నారని తెలిపారు.


కోడి కత్తి, గొడ్టలి పోటు విషయంలో వైఎస్ జగన్ డ్రామాలు అందరూ చూశారని చెప్పారు. గత ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదంటూ జగన్‌పై నిప్పులు చెరిగారు. తమ అధికారులు ఇచ్చిన సమాచారం తప్పు అని నిరూపించాలన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి దీనిపై చర్చించాలంటూ వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. ప్రజలందరి కుటుంబాల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని వివరించారు. దీనిపై త్వరలో నివేదిక వస్తుందనే డీఎస్సీ‌పై బురద జల్లుతున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.


ఇలాంటి అబద్ధాల ప్రచారంతో ఈ సారి జగన్ ఎమ్మెల్యే కూడా కాలేడన్నారు. గ్రూప్ వన్ అక్రమాలపై కోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతుందన్నారు. ఎపీపీఎస్సీలో అవకతవకలు బయటకు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గ్లోబల్ ప్రచారంతో ప్రజలను వైసీపీ నాయకులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో ఎంపికై 16 వేల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు అల్లరి చేస్తున్నారని చెప్పారు. అంటే జగన్ ఇప్పటి వరకు కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు.


అధికారులు చెప్పింది కూడా వినే పరిస్థితిలో వైసీపీ నేతలు లేరన్నారు. వాళ్ల ఉద్దేశం అబద్ధాలు ప్రచారం చేయడం.. అందుకే వారికి మంచి కనిపించదు.. వినిపించదని వ్యంగ్యంగా అన్నారు. స్పోర్ట్స్ కోటాపై అల్లరి చేస్తున్న వైసీపీ నేతలకు అధికారులు వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. డీఎస్సీ కోసం నిర్వహించిన పరీక్షల్లో నిజంగా అభ్యంతరాలు ఉంటే వాటిని తామూ పరిగణలోకి తీసుకుంటామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రీజినల్ రింగ్ రోడ్డుకు బీజేపీ సహకరించాలి.. కేంద్రం ముందుకు రావాలి: మంత్రి శ్రీధర్ బాబు

కొవ్వూరు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిన పలు రైళ్ల రాకపోకలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 01:14 PM