Share News

రీజినల్ రింగ్ రోడ్డుకు బీజేపీ సహకరించాలి.. కేంద్రం ముందుకు రావాలి: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:54 AM

రీజినల్ రింగ్ రోడ్డు (RRR)కు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ సహకరించాలని.. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు వస్తే జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డుకు బీజేపీ సహకరించాలి.. కేంద్రం ముందుకు రావాలి: మంత్రి శ్రీధర్ బాబు
TG Minister Sridhar Babu

హైదరాబాద్, సెప్టెంబర్ 11: రీజినల్ రింగ్ రోడ్డు (RRR)కు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ సహకరించాలని.. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు వస్తే జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు ఐటీ కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.


డేటా సెంటర్ల కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వివరించారు. డేటా సెంటర్ల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్లో గూగుల్ ఇంకుబేషన్ హబ్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తే అక్కడకు కంపెనీలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


గత ప్రభుత్వంలో కొన్ని జిల్లాల్లో ఐటీ టవర్లను నిర్మించి వదిలేశారని చెప్పారు. అవి చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి కంపెనీలను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. పెద్దపల్లిలో యాంకర్ పార్టనర్ కోసం వెతుకుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అధికారం పోయినా అహంకారం వీడలేదు: బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ ఫైర్

కొవ్వూరు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిన పలు రైళ్ల రాకపోకలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 12:05 PM