గాజువాకలో దారుణం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:29 PM
విశాఖపట్నం నగరంలోని గాజువాక పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
విశాఖపట్నం, జులై 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నగరంలోని గాజువాక పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. మహిళలు, బాలికలపై జరిగే నేరాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్
పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News