Share News

విశాఖపట్నంలో భారీ వర్షం

ABN , Publish Date - May 02 , 2026 | 01:02 AM

ఎండ తీవ్రతతో అల్లాడితున్న నగరవాసులకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి ఆకాశం మేఘావృతమై అనేకచోట్ల జల్లులు కురిశాయి.

విశాఖపట్నంలో భారీ వర్షం
Vizag Rains

  • చల్లబడిన వాతావరణం...సేదతీరిన జనం

  • ఏటా మే 1న వర్షం?

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రతతో అల్లాడితున్న నగరవాసులకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి ఆకాశం మేఘావృతమై అనేకచోట్ల జల్లులు కురిశాయి. ఉపరితల ద్రోణి, వాతావరణ అనిశ్చితి ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచీ అడపాదడపా చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో అనేకచోట్ల భారీవర్షం కురిసింది.


ఆనందపురంలో 51.5 మిల్లీమీటర్లు, పరదేశిపాలెంలో 33.5, పెందుర్తి బీసీ కాలనీలో 23.7, మధురవాడ జెడ్పీ హైస్కూల్‌ వద్ద 22, కాపులుప్పాడలో 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఒక్క 2024లో తప్ప 2018 నుంచి 2026 వరకు ఏటా మే ఒకటో తేదీన విశాఖపట్నంలో వర్షం కురుస్తున్నదని వెదర్‌మ్యాన్‌ ఒకరు పోస్టు చేశారు.

Updated Date - May 02 , 2026 | 07:06 AM