Share News

మన్యం జిల్లాలో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

ABN , Publish Date - Apr 05 , 2026 | 09:31 AM

ఆంధ్ర ఊటీ అరకు లోయతో పాటు పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి 11.31 నిమిషాలకు ఈ భూ ప్రకంపనలు వచ్చాయి.

మన్యం జిల్లాలో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

పాడేరు, ఏప్రిల్ 05: ఆంధ్ర ఊటీ అరకు లోయతో పాటు పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి 11.31 నిమిషాలకు ఈ భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని సామాన్లన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత 4.4గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.


ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ముంచంగిపుట్, హుకుంపేట, జోలాపుట్, సుజన్‌కోట తదితర ప్రాంతాల్లో సైతం భూమి కంపించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూకంపం రాలేదని స్థానికులు చెబుతున్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

100 ఎకరాల్లో అత్యాధునిక ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌

For More AP News And Telugu News

Updated Date - Apr 05 , 2026 | 09:49 AM