Share News

వైద్యుల నియామకాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ తేవాలి

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:48 AM

సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ పద్ధతిని తేవాలని హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్డీఏ) ప్రభుత్వాన్ని కోరింది.

వైద్యుల నియామకాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ తేవాలి

  • మంత్రి రాజనర్సింహకు హెచ్‌ఆర్డీఏ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకాల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ పద్ధతిని తేవాలని హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్డీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు ఆ సంస్థ ప్రతినిఽధులు వైద్య మంత్రి దామోదర రాజనర్సింహను శనివారం ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. వైద్య విద్య సంచాలకుల పరిధిలో భర్తీ చేయనున్న 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిఽధిలోని 1,623 సీఏస్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల నియామక ప్రక్రియలో వెయిటింగ్‌ లిస్ట్‌లు సిద్థం చేయాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు హెచ్‌ఆర్డీఏ ప్రతినిధులు తెలిపారు.

Updated Date - Apr 05 , 2026 | 06:48 AM