Share News

సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:26 AM

రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చే వారికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని...

సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

  • సింగిల్‌ విండోలో షూటింగ్‌లకు వేగంగా అనుమతులు

  • త్వరలో నంది అవార్డులు: మంత్రి కందుల దుర్గేశ్‌

గుంటూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చే వారికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ స్పష్టం చేశారు. శనివారం గుంటూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సహజసిద్ధమైన లొకేషన్లకు నిలయమన్నారు. రాష్ట్రంలో షూటింగ్‌లు విజయవంతంగా జరుగుతున్నాయని, సింగిల్‌ విండో విధానం ద్వారా షూటింగ్‌లకు అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామని తెలిపారు. తిరుపతి, వైజాగ్‌, అమరావతి ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ.. అవసరమైన భూములను కేటాయించేందుకు హామీ ఇచ్చారు. త్వరలోనే నంది అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తామని, నంది నాటకోత్సవాల నిర్వహణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమ తరలివచ్చి, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 05 , 2026 | 05:27 AM