Share News

100 ఎకరాల్లో అత్యాధునిక ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌

ABN , Publish Date - Apr 05 , 2026 | 07:22 AM

అత్యాధునిక సౌకర్యాలతో జీడిమెట్ల గాజులరామారంలో టీజీఎస్‌ ఆర్టీసీ 100 ఎకరాల్లో ఆధునిక బస్‌టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

100 ఎకరాల్లో అత్యాధునిక ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌

  • గాజులరామారంలో స్థలం కేటాయింపు

  • ఎలక్ట్రిక్ బస్సులకు ప్రత్యేక చార్జింగ్‌ స్టేషన్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక సౌకర్యాలతో జీడిమెట్ల గాజులరామారంలో టీజీఎస్‌ ఆర్టీసీ 100 ఎకరాల్లో ఆధునిక బస్‌టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రత్యేక బస్‌ టెర్మినల్‌తోపాటు సిటీ బస్సులకు ఒక టెర్మినల్‌, ఎలక్ర్టిక్‌ బస్సుల కోసం ప్రత్యేక చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌కురోజూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఈ బస్‌ టెర్మినల్‌ నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌.. గాజులరామారంలో 100ఎకరాలను టీజీఎస్‌ఆర్టీసీకి ఇటీవల కేటాయించారు. ఇందులో సుమారు 30 ఎకరాల్లో అంతరాష్ట్ర బస్సుల కోసం ప్రత్యేక బస్‌ టెర్మినల్‌ అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ భావిస్తోంది. సిటీ బస్సులను ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు నడిపేలా సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సిటీ టెర్మినల్‌ను ఆధునిక సౌకర్యాలు, షాప్‌లతో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ర్టిక్‌ బస్సు డిపో, ఈవీ బస్సుల కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక చార్జింగ్‌ స్టేషన్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 07:24 AM