Share News

సీఐఐ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మంత్రి లోకేశ్

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:49 PM

ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ సీఐఐ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేతన్నల కళను చాటిచెప్పే చేనేత జాకెట్ ధరించారు.

 సీఐఐ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సీఐఐ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేతన్నల కళను చాటిచెప్పే చేనేత జాకెట్ ధరించారు. ఏపీ చేనేత సంప్రదాయాలకు గౌరవంగా హ్యాండ్‌లూమ్ జాకెట్ ధరించారు. రాష్ట్రంలోని చేనేత కళాకారుల నైపుణ్యానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ సందేశం ఇచ్చారు. రాష్ట్ర సంప్రదాయ హస్తకళలు, నేతన్నల ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై ప్రచారం కల్పించారు. జాకెట్ ఏ చేనేత కళకు ప్రతీకో గుర్తించాలంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ ఆసక్తికర ప్రశ్న వేశారు.


కాగా, విశాఖపట్నంలో అట్టహాసంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు - 2026 ఈరోజు (గురువారం) ప్రారంభమైంది. 'నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్' థీమ్‌తో మొదటి రోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సుకు 58 దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు తరలివచ్చారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యంగా ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీపై సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ సభలో మంత్రి లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు

తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి

పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 01:55 PM