Share News

విశ్రాంత ఆర్చ్‌బిషప్ డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతి.. నారా లోకేశ్ సంతాపం

ABN , Publish Date - Jun 08 , 2026 | 04:26 PM

విశాఖపట్నం విశ్రాంత ఆర్చ్‌బిషప్ మోస్ట్ రెవ. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతిపై.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు తుదిశ్వాస విడవడం ఎంతో బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు.

విశ్రాంత ఆర్చ్‌బిషప్ డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతి.. నారా లోకేశ్ సంతాపం
AP Minister Nara Lokesh

విశాఖపట్నం, జూన్8 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విశ్రాంత ఆర్చ్‌బిషప్ మోస్ట్ రెవ. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు (Prakash Mallavarapu) మృతిపై.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు తుదిశ్వాస విడవడం ఎంతో బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు. విద్యావంతుడిగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన తన జీవితాన్ని క్రైస్తవ సమాజ సేవకు అంకితం చేశారని కొనియాడారు. విజయవాడ బిషప్‌గా, కడప బిషప్‌గా, ఏలూరు డయాసిస్ అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ ఆర్చ్‌బిషప్‌గా, శ్రీకాకుళం అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు విశిష్ట సేవలు అందించారని స్మరించుకున్నారు.


ఆయన సేవలు కేవలం చర్చి పరిమితుల్లోనే కాకుండా సమాజంలోని అన్నివర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచాయని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆదర్శవంతమైన జీవనశైలి, వినయం, ప్రేమాభిమానాలతో పేదల సంక్షేమానికి కృషి చేసిన బిషప్‌గా ఆయన చిరస్మరణీయులుగా నిలిచిపోతారని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులు అర్పించారు నారా లోకేశ్.


ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు

16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల

Read AP News Latest And Telangana News  And National News

And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 04:31 PM