బలహీనపడిన తీవ్ర వాయుగుండం.. కోస్తాంధ్రలో మరో రెండు రోజులు వర్షాలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:08 PM
రాష్ట్రంలో భారీ వర్షాలకు కారణమైన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో భారీ వర్షాలకు కారణమైన తీవ్ర వాయుగుండం క్రమక్రమంగా బలహీనపడుతూ.. అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ మేరకు కోస్తాంధ్రలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వారు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం విశాఖ సమీపంలో తీరం దాటడంతో.. రాష్ట్రంలో ఐదు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం క్రమక్రమంగా బలహీనపడుతూ.. వాయవ్య దిశగా పయనిస్తోంది. తీవ్ర వాయుగుండం కాస్త దక్షిణ ఒడిశా, చత్తీస్‌గడ్ ప్రాంతాలకు చేరేసరికి వాయుగుండంగా మారిందని.. రానున్న 12 గంటల్లోగా మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది.
ఈ మేరకు కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి సవిత
విశాఖలో క్రైమ్ రికవరీ.. రూ.1.13 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు అప్పగింత
Read Latest AP News And Telugu News