విశాఖలో క్రైమ్ రికవరీ.. రూ.1.13 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు అప్పగింత
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:32 PM
విశాఖ నగర పోలీసులు ఆగస్టు-2026 నెలలో రూ.1,13,87,040 విలువైన ఆస్తులను క్రైమ్ రికవరీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి చేతుల మీదగా బాధితులకు పోగొట్టుకున్న సొత్తును అందజేశారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 25: విశాఖ నగర పోలీసులు ఆగస్టు-2026 నెలలో రూ.1,13,87,040 విలువైన ఆస్తులను క్రైమ్ రికవరీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి చేతుల మీదగా బాధితులకు పోగొట్టుకున్న సొత్తును అందజేశారు. ఆస్తి నేరాలకు సంబంధించి ఆగస్టు నెలలో 74 కేసులను పోలీసులు ఛేదించగా.. 102 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రికవరీ చేసిన ఆస్తులలో 796 గ్రాముల బంగారం, 9.5 కేజీల వెండి, రూ.14.75 లక్షల నగదు ఉన్నాయి. దొంగిలించబడిన రూ.60.75 లక్షల విలువైన 414 మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు రికవరీ చేశారు.
విశాఖలో నేరాల నియంత్రణ కోసం ఆగస్టు నెలలో కొత్తగా 661 సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్రైమ్ వింగ్ ఆధ్వర్యంలో 472 ప్రత్యేక సదస్సులు నిర్వహించామన్నారు. ఈ ఏడాదిలో అత్యధికంగా ఆగస్టు నెలలోనే రూ.1.13 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేసినట్లు చెప్పారు. 26వ రికవరీ మేళా ద్వారా ఇప్పటివరకు రూ.26.37 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు అందజేశామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పారిశ్రామికవేత్తలతో లోకేశ్ వరుస భేటీలు.. ఏపీలో ప్రాజెక్టులు పెట్టాలని ఆహ్వానం
శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి సవిత
Read Latest AP News And Telugu News