Share News

శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి సవిత

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:05 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సవిత అన్నారు. కార్ల పరిశ్రమ దగ్గర నుంచి గగన తలంలో ఎగిరే విమానాల పరిశ్రమలు సత్యసాయి జిల్లాకి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పుకొచ్చారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం: మంత్రి సవిత
Minister Savitha

శ్రీ సత్యసాయి జిల్లా, సెప్టెంబర్ 25: శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అన్నారు. కార్ల పరిశ్రమ దగ్గర నుంచి గగన తలంలో ఎగిరే విమానాల పరిశ్రమలు సత్యసాయి జిల్లాకి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈరోజు(శుక్రవారం)జిల్లాలోని కొత్తచెరువులో నూతన జడ్పీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చొరవతోనే జిల్లాకు పరిశ్రమలు వెల్లువెత్తున్నాయన్నారు. సత్యసాయి జిల్లాకు తాగునీరు, సాగునీరు అందించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు, సీఎం చంద్రబాబు దే అని మంత్రి సవిత కొనియాడారు.


శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీ స్థానాలను గెలుస్తామన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ విజయమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. టీడీపీ శ్రేణులు సమష్టిగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. తప్పిన ప్రమాదం

పారిశ్రామికవేత్తలతో లోకేశ్ వరుస భేటీలు.. ఏపీలో ప్రాజెక్టులు పెట్టాలని ఆహ్వానం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 03:05 PM