Share News

నెల్లూరులో ఎంపీపీ ఎన్నిక వాయిదా.. ఎంపీ గురుమూర్తియే కారణమంటూ టీడీపీ ఆరోపణలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:43 PM

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడడంతో ఎంపీడీవో కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి జోక్యం వల్లనే ఎన్నిక వాయిదా పడిందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

నెల్లూరులో ఎంపీపీ ఎన్నిక వాయిదా.. ఎంపీ గురుమూర్తియే కారణమంటూ టీడీపీ ఆరోపణలు
venkatagiri mpp election postponed

నెల్లూరు, నవంబర్ 19: జిల్లాలోని వెంకటగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి జోక్యం వల్లనే ఎన్నిక వాయిదా పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తడంతో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే..


జిల్లాలోని వెంకటగిరి‌ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీడీపీ, వైసీపీలు నాలుగు చొప్పున సమాన బలాన్ని కలిగి ఉన్నాయి. దీంతో ఎంపీపీ ఎన్నిక విషయంలో అసందిగ్ధత నెలకొంది. రెండు పార్టీలకు సమాన బలం ఉండడం వల్ల.. ఏ పార్టీకి చెందిన వారు ఎంపీపీ అవుతారన్న ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో.. వైసీపీ ఎంపీటీసీ ఒకరు.. టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఎంపీపీగా తమ అభ్యర్థే గెలుస్తారని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉండగా.. ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.


మద్దతు ఇస్తానన్న వైసీపీ ఎంపీటీసీ వెనుకడుగు వేశారు. దీంతో టాస్ వేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారి ఇరువర్గాలను కోరారు. కానీ టాస్ వేయడానికి టీడీపీ శ్రేణులు అంగీకరించలేదు. దీంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాగా.. ఎంపీపీ ఎన్నికకు హాజరైన ఎంపీ గురుమూర్తి జోక్యం వల్లనే ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎంపీ ఈ వివాదంలో కలుగజేసుకుని.. టీడీపీకి మద్దతు ఇవ్వవద్దంటూ.. వైసీపీ ఎంపీటీసీని భయబ్రాంతులకు గురిచేశారని.. అందుకే ఆయన వెనుకడుగు వేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ గురుమూర్తి, టీడీపీ ఎంపీటీసీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్ అసంతృప్తి

పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి

Read latest AP News And Telugu NEws

Updated Date - Nov 19 , 2026 | 04:04 PM