Share News

బిహార్‌‌ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు వాసుల మృతిపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి

ABN , Publish Date - Jun 08 , 2026 | 10:49 AM

బిహార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికుల మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ​మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

బిహార్‌‌ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు వాసుల మృతిపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి
Nellore Pilgrims Accident

అమరావతి, జూన్ 8: బిహార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి చెందారు. ​నెల్లూరు జిల్లా యాత్రికుల మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ​మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రమాద వార్తపై తక్షణమే స్పందించిన మంత్రి నారాయణ.. బిహార్ అధికారులతో అత్యవసర సంప్రదింపులు జరిపారు. ​ఈనెల 1న నెల్లూరు జిల్లా నుంచి పుణ్యక్షేత్రాల దర్శనానికి 40 మంది యాత్రికులు బస్సులో బయలుదేరారు. ​వీరంతా ఆత్మకూరు, దుత్తలూరు, సంగం మండలాలకు చెందిన వారుగా తెలుస్తోంది. ​వారణాసి వెళ్తుండగా లారీని ఓవర్‌టెక్ చేయబోయి యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆత్మకూరుకు చెందిన ఒకరు, సంగం మండలానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.


ప్రమాదంపై మంత్రి ఆనం విచారం

బిహార్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసుల మృతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. జిల్లా యాత్రికుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. బిహార్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు.. దొరకని బంగారు ఆభరణాలు

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం.. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 11:41 AM