Share News

పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు.. దొరకని బంగారు ఆభరణాలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 09:39 AM

కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో చోరీకి గురైన బంగారు ఆభరణాల ఆచూకీ ఇంకా తెలియకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు.. దొరకని బంగారు ఆభరణాలు
PMJ jewellery robbery

కరీంనగర్, జూన్ 8: జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో చోరీకి గురైన బంగారు ఆభరణాల ఆచూకీ ఇంకా తెలియకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రధాన నిందితుడు సుబోధి సింగ్.. విచారణలో నోరు మెదపకుండా పోలీసులను తప్పుదారి పట్టించేలా వాంగ్మూలాలు ఇస్తున్నట్లు సమాచారం. గోల్డెన్ థీఫ్ గ్యాంగ్‌‌‌స్టర్‌‌గా పేరు తెచ్చుకున్న నిందితుడు సుబోధి సింగ్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది.


గతంలో ఈ కేసులో మరో నిందితుడు రఘునాథ్ కర్మాకర్.. ఆభరణాలను గుండాల అటవీ ప్రాంతంలో దాచామని వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఆభరణాలు వేరే చోట దాచామంటూ తాజాగా మరోసారి రఘునాథ్ వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసు విచారణను మరింత క్లిష్టంగా మార్చింది. పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో సుబోధి సింగ్ వ్యూహాత్మకంగా వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో బంగారు ఆభరణాల ఆచూకీని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

ట్రంప్ మాటల్ని పట్టించుకోని ఇజ్రాయెల్!.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 10:56 AM