Share News

నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి

ABN , Publish Date - Jun 08 , 2026 | 07:32 AM

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలను తెలసుకోనున్నారు..

నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి
CM Chandrababu Tour

పెనుగొండ, జూన్ 08: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా స్థానిక యంత్రాంగం, పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. షెడ్యూల్ ప్రకారం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు సిద్ధాంతం గ్రామానికి చేరుకుంటారు. బహిరంగ సభ ప్రాంగణానికి వచ్చే ముందు, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శన (అగ్రికల్చర్ స్టాల్స్)ను ఆయన సందర్శిస్తారు. సరికొత్త సాంకేతికత, వ్యవసాయ పరికరాలను పరిశీలించిన అనంతరం.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.


బహిరంగ సభ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లనున్నారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని, సాగు నీటి లభ్యతను పరిశీలించడంతో పాటూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, స్థానిక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫొటోషూట్‌లో పాల్గొని వారిని ఉత్సాహపరచనున్నారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి నేరుగా ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్తారు.

వృద్ధుడి వీడియోపై స్పందించిన సీఎం

పెనుగొండ మండలం రామన్నపాలెం శివారు కామధేనువు లంకకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ వీడియోపై సీఎం చంద్రబాబు స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబును కలవాలనే కోరికను తెలియజేసిన వృద్ధుడు.. ‘ఆ మహానుభావుడిని దూరం నుంచి చంద్రబాబు గారూ అని మొక్కుతా.. ఆయన రెండు చేతులూ ఊపుతారు. అది చాలు’ అని అన్నారు. ఈ మాటలను ఆయన మనవడు రెండ్రోజుల క్రితం వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘సత్యనారాయణ గారూ... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!’ అని సమాధానమిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 07:43 AM