డెలివరీ బాయ్ బ్యాగులో పాము.. నడిరోడ్డులో రచ్చరచ్చ..
ABN , Publish Date - Jun 07 , 2026 | 07:00 AM
ఓ డెలివరీ బాయ్ బ్యాగునుంచి పెద్ద పాము బయటపడింది. నడిరోడ్డుపై ఆ పాము రచ్చ రచ్చ చేసింది. పాము దెబ్బకు ఆ రోడ్డుపై వెళుతున్న పాదచారులు, వాహనదారులు భయపడిపోయారు. డెలివరీ బాయ్ ధైర్యం చేసి పామును బ్యాగులో వేసుకుని వెళ్లటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.
ఇంటర్‌నెడ్ డెస్క్: ఓ డెలివరీ బాయ్ బ్యాగునుంచి పెద్ద పాము బయటపడింది. నడిరోడ్డుపై ఆ పాము రచ్చ రచ్చ చేసింది. పాము దెబ్బకు ఆ రోడ్డుపై వెళుతున్న పాదచారులు, వాహనదారులు భయపడిపోయారు. డెలివరీ బాయ్ ధైర్యం చేసి పామును బ్యాగులో వేసుకుని వెళ్లటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ డెలివరీ బాయ్ వీపునకు బ్యాగ్ తగిలించుకుని బైక్‌పై వెళుతున్నాడు. వస్తువులు లేకపోయినా అతడి బ్యాగ్ అటు, ఇటు కదులుతుండటం గమనించాడు.
కొంతదూరం పోయిన తర్వాత రోడ్డు పక్క బైక్ ఆపాడు. బ్యాగ్ తెరవగానే పెద్ద పాము బుస్‌మని పైకి లేచింది. దీంతో డెలివరీ బాయ్ భయపడిపోయాడు. ఆ పాము వెంటనే రోడ్డుపైకి దూకి పారిపోవడానికి ప్రయత్నించింది. పామును చూడగానే రోడ్డుపై వెళుతున్న పాదచారులు, వాహనదారులు భయపడిపోయారు. డెలివరీ బాయ్ ధైర్యం చేసి పామను పట్టడానికి సిద్ధం అయ్యాడు. పాము అతడి నుంచి తప్పించుకోవడానికి అటు, ఇటు వెళ్లసాగింది. డెలివరీ బాయ్ ఎంతో చాకచక్యంగా పామును పట్టేశాడు. బ్యాగులో వేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు.
దీంతో పాదచారులు, వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ పామును చూస్తుంటేనే భయం వేస్తోంది. డెలివరీ చాలా ధైర్యవంతుడు’..‘డెలివరీ బాయ్ ఆ పామును అంత ధైర్యంగా ఎలా పట్టుకున్నాడు. పాము విషపూరితమైనదేనా..’..‘వీడియోలో చూస్తుంటేనే భయంగా ఉంది. ఆ రోడ్డుపై ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరు తొలగింపు
12 ఏళ్ల తెలంగాణలో ప్రజల బతుకులు మారలేదు