కేఎన్‌ఆర్ బంధువులకు నోటీసులు
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:23 AM
లిక్కర్ స్కామ్ విచారణలో జగన్ పీఏ కేఎన్‌ఆర్ బంధువులు, స్నేహితులకు సిట్ నోటీసులు జారీ చేసింది.
విచారణ కోసం నేడు కడపకు?
కడప, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): లిక్కర్ స్కామ్ విచారణలో జగన్ పీఏ కేఎన్‌ఆర్ బంధువులు, స్నేహితులకు సిట్ నోటీసులు జారీ చేసింది. కడపలోని రాజారెడ్డివీధికి చెందిన ఓ సూపర్‌మార్కెట్ యజమానికి, జగన్ హయాం లో వైవీయూ పాలకమండలి సభ్యుడికి, కేఎన్‌ఆర్ బంధువులకు నోటీసులు ఇవ్వడం కడపలో ప్రకంపనలు సృష్టిస్తుంది. సిట్ ఇప్పటికే కేఎన్‌ఆర్‌ను విచారించింది. కేఎన్‌ఆర్ ఆర్థిక లావాదేవీల్లో కొన్ని కడపకు సంబంధం ఉండడంతో అక్కడ కొందరికి సిట్ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. వారిని విచారించేందుకు సోమవారం కడపకు సిట్ బృందం రానున్నట్లు సమాచారం.