బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Jun 08 , 2026 | 08:33 AM
నెల్లూరు జిల్లా నుంచి కాశీ క్షేత్రానికి వెళ్తున్న భక్తుల బస్సు బీహార్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
నెల్లూరు, జూన్ 08: జిల్లా నుంచి కాశీ క్షేత్రానికి వెళ్తున్న భక్తుల బస్సు బీహార్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. ఔరంగాబాద్ వద్ద యాత్రికుల బస్సును ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిల్లాలోని సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లిన తమ వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో బాధితుల స్వగ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, సంగం, దుత్తలూరు మండలాలకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సహాయక చర్యలు చేపట్టారు.
Also Read:
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి
ఫిట్‌నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..