పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం.. రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం
ABN , Publish Date - Jun 08 , 2026 | 10:29 AM
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్దపులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నట్లు ధృవీకరించిన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు.
పోలవరం జిల్లా, జూన్ 8: జిల్లాలోని దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్దపులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నట్లు ధృవీకరించిన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు. పులిని సురక్షితంగా బంధించడం కోసం అటవీశాఖ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. థర్మల్ డ్రోన్లు, రేడియో కాలర్ల సహాయంతో పులి కదలికలను రెస్క్యూ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. నేలకోట పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న పులిని హనుమాన్ బృందాలు రాత్రంతా పర్యవేక్షించినట్లు సమాచారం.
పులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పులి.. గ్రామాల వైపు వెళ్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అటవీ శాఖ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు పాల్గొన్నాయి. పులి సురక్షితంగా పట్టుబడే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి
పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసు.. దొరకని బంగారు ఆభరణాలు
Read Latest AP News And Telugu News