పల్లె పండుగ 3.0తో గ్రామాల రూపురేఖలు మారతాయి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:06 PM
పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల రూపురేఖలు మారతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లాలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ ప్రారంభించారు.
నెల్లూరు, సెప్టెంబర్ 29: పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామాల రూపురేఖలు మారతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లాలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రెండేళ్లలో పల్లె పండుగ, జల్‌జీవన్ మిషన్ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు కనీస నిధులు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు అండతో పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేశామని చెప్పుకొచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు, మినీ గోకులాలు, ఫామ్‌పాండ్స్ నిర్మించామని పవన్ వెల్లడించారు. మారుమూల తండాలకు కూడా రోడ్లు వేశామన్నారు. 2024 తర్వాత పల్లెల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. అమరజీవి జలధార ద్వారా అనేక ప్రాంతాలకు తాగునీరు ఇస్తున్నామని తెలిపారు.161 గ్రామీణ నియోజకవర్గాల్లో డొంక రోడ్లు నిర్మిస్తున్నాని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పల్లె పండుగ విజయవంతమైందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి పట్టుకొమ్మ: మాధవ్
గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి పట్టుకొమ్మ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక ఏళ్లపాటు పల్లెలపై దృష్టి పెట్టలేదని తెలిపారు. పల్లెల్లో జీవించలేక అనేకమంది వలసలు పోయారని అన్నారు. రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని.. గాంధీజీ కలలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని మాధవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
‘రెండు నెలలు ఆలస్యం’ ప్రచారం అవాస్తవం.. ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ క్లారిటీ..
10 నెలలుగా పెద్దపులి సంచారం.. భయాందోళనలో పోలవరం ఏజెన్సీ వాసులు
Read Latest AP News And Telugu News