Share News

సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి భార్య

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:56 PM

నంద్యాల జిల్లాలోని బనగానపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి భార్య నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి భార్య
minister wife sarpanch nomonation

నంద్యాల, నవంబర్ 19: ఆంధ్రపదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి జనార్దన్ రెడ్డి భార్య ఇందిరా రెడ్డి.. బనగానపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా.. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.


నామినేషన్ సందర్భంగా మంత్రి సతీమణి ఇందిరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. బనగానపల్లి పంచాయతీని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని.. అందుకే సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీలో పాల్గొంటున్నానని ఆమె పేర్కొన్నారు. నామినేషన్ అనంతరం ఆమెకు కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయం కోసం కూటమి ఎల్లప్పుడూ పాటుపడుతుందని తెలిపారు. కాగా ఈ నామినేషన్ ప్రక్రియలో మంత్రి జనార్దన్ రెడ్డితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి

ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం

Read latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 03:14 PM