Share News

సీఎం, డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టులు

ABN , Publish Date - May 06 , 2026 | 04:36 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు..

సీఎం, డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టులు

  • కడప జిల్లాకు చెందిన నిందితుడి అరెస్టు

గుంటూరు కార్పొరేషన్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు ఈస్ట్‌ డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ పాత గుంటూరు పోలీస్‌ ేస్టషన్‌లో మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా బద్వేల్‌ మండలం రామాంజనేయనగర్‌కు చెందిన పి.చిన్న రామయ్య కుమారుడు సురేశ్‌ సామాజిక మాధ్యమాల్లో నాయకులపై అసభ్య ప్రచారం, మార్ఫింగ్‌ వీడియో పోస్టులు పెడుతున్నాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పాత గుంటూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెట్టినా, అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

Updated Date - May 06 , 2026 | 04:37 AM