Share News

నంద్యాలలో వైసీపీకి భారీ షాక్

ABN , Publish Date - Sep 24 , 2026 | 02:50 PM

నంద్యాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు నేతలతోపాటు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు.

నంద్యాలలో వైసీపీకి భారీ షాక్

నంద్యాల, సెప్టెంబర్ 24: నంద్యాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన పలువురు నేతలతోపాటు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం పార్టీ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో మాజీ సర్పంచ్ ఎల్లయ్యతోపాటు దాదాపు 200 మంది నేతలు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు తామంతా ఆకర్షితులమైనట్టు తెలిపారు.


అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం వరకు వైసీపీలో సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి, జడ్పీ చైర్మన్ పదవికి బొత్స సత్యనారాయణ సమీప బంధువు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చిన్న శ్రీనుతోపాటు ఆయన కుమార్తె ఇటీవల టీడీపీలో చేరారు.


రాజధాని అమరావతిలో కండువా కప్పి వారిని పార్టీలోకి సీఎం చంద్రబాబు ఆహ్వానించిన విషయం విదితమే. విజయనగరం జిల్లాలో చిన్న శ్రీనుకు ప్రధాన అనుచరులుగా ఉన్న వైసీపీలోని పలువురు జడ్పీటీసీలు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. వారంతా టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లాలో వైసీపీని వీడే వారి సంఖ్య మరింత పెరుగుతుందని వారు వెల్లడించారు.


2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు వైసీపీలో నేతల నుంచి కేడర్ వరకు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

జేఎన్‌టీయూ హాస్టళ్లలో భద్రత డొల్ల!

మహా గణపతి మునిగేలా చర్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 03:25 PM