పునర్వికాకి మంత్రి లోకేశ్ అండ.. చిన్నారికి భారీ సాయం
ABN , Publish Date - Feb 25 , 2026 | 10:01 PM
SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్వికాకి ఆంధ్రప్రదేశ్ విద్య. ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్ల సమష్టి సాయం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్వికాకి ఆంధ్రప్రదేశ్ విద్య. ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) రూ.6 కోట్ల సమష్టి సాయం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా పునర్విక కుటుంబానికి నైతిక మద్దతు తెలుపుతున్నారు. SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక ఎంతో ధైర్యంగా ఈ వ్యాధితో పోరాడుతోంది.
చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం రూ.16 కోట్ల ఇంజక్షన్. చిన్నారి పట్ల స్పందించిన ప్రతి హృదయం రూ.10 కోట్ల విరాళాలు సేకరించింది. ఇంకా కావాల్సిన రూ.6 కోట్లు మంత్రి నారా లోకేశ్ సమకూరుస్తామని ప్రకటించారు. పునర్విక పాప ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చినవారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినవారు, ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పునర్విక తల్లిదండ్రులకు తనవంతు సహాయం రూ.6 కోట్లు అందజేసి, చిన్నారి పరిపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు జరిగే చికిత్సకు సహకరించే చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదు: మంత్రి నారా లోకేశ్
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..
Read Latest Telangana News And AP News And Telugu News