Share News

9 ఏళ్ల బాలికపై దుశ్చర్య

ABN , Publish Date - Aug 19 , 2026 | 08:12 AM

దొంగతనం నెపంతో తొమ్మిదేళ్ల బాలికను స్తంభానికి కట్టేసి హింసించిన అమానుష ఘటన నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గూడెంలో చోటు చేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

9 ఏళ్ల బాలికపై దుశ్చర్య

దొంగతనం నెపంతో స్తంభానికి కట్టేసిన వైనం

ఇద్దరిపై కేసు నమోదు.. నంద్యాల జిల్లాలో ఘటన

ఆత్మకూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): దొంగతనం నెపంతో తొమ్మిదేళ్ల బాలికను స్తంభానికి కట్టేసి హింసించిన అమానుష ఘటన నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గూడెంలో చోటు చేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ నిందితులను మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన బాలిక తమ గ్రామంలోని ఓ దుకాణం వద్దకు కుర్‌కురే స్నాక్స్‌ కొనేందుకు వెళ్లింది. ఆ సమయంలో దుకాణంలో ఉన్న డబ్బుల డబ్బా కనిపించలేదు.


బాలికే దొంగలించిందన్న నెపంతో సదరు దుకాణ యజమాని నేనావత్‌ రాజునాయక్‌, అతడి బావ మల్లు నాయక్‌ కలిసి బాలిక చేతులను తాడుతో స్తంభానికి కట్టేసి హింసించారు. పైగా వీడియో తీసి వైరల్‌ చేశారు. బాలిక తల్లి అక్కడికి వచ్చి తమ కూతురిని విడిచిపెట్టాలని ఎంత వేడుకున్నా వారు మధ్యాహ్నం 4 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అలాగే నిర్బంధించారు. బాలిక తీవ్ర మానసిక ఆందోళనకు గురికావడంతో చలించిపోయిన తల్లి.. ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు తీర్పు మేరకు రిమాండ్‌కు తరలించారు.


వార్తలు కూడా చదవండి...

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 08:13 AM