Share News

యువతతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం: గోవా సీఎం ప్రమోద్ సావంత్

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:05 PM

వికసిత్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత యువత అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. 40 ఏళ్ల వయసు తరువాత యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

యువతతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం: గోవా సీఎం ప్రమోద్ సావంత్
Goa CM Pramod Sawant

విజయవాడ, ఆగస్టు 22: వికసిత్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత యువత అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సదస్సులో ప్రమోద్ పాల్గొని ప్రసంగించారు. యువత పాలిటిక్స్‌లోకి రావాలనేది పెద్ద ప్రశ్న అన్నారు. 40 ఏళ్ల వయసు తరువాత యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అనుభవం, స్థిరత్వం ముందు.. ఆ తరువాతే పాలిటిక్స్ అని చెప్పుకొచ్చారు. యువశక్తి, నారీశక్తి, కిసాన్ శక్తి, గరీబ్ కల్యాణ్.. వికసిత్ భారత్‌‌కు నాలుగు మూలస్తంభాలుగా అభివర్ణించారు. గతంలో చాలామందికి బ్యాంకు అకౌంట్‌లు లేవని.. మోదీ ప్రభుత్వంలో జనధన్ ఖాతాలు ఇచ్చారని తెలిపారు.


5G కనెక్టివిటీ ఇప్పుడు అందుబాటులో ఉందని గోవా సీఎం అన్నారు. మోదీ ప్రభుత్వంలో వికసిత్ భారత్ 2047 వైపు అడుగులేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ యువతతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. భారతదేశంలో 50 శాతం యువత ఉన్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో విజన్‌తో ఉన్నారన్నారు. పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న యువత చాలా అవసరమని.. పాలసీ తయారు చేయగలిగేలా, ఫలితాలు సాధించేలా యువత ఉండాలని సూచించారు. భవిష్యత్ ఆంత్రప్రెన్యూర్లు, పాలసీ మేకర్స్, పొలిటిషియన్స్‌గా యువత ఉండాలని ఆకాంక్షించారు. బాధ్యత కలిగిన, దేశం కోసం పని చేయగలిగిన, పారదర్శకత కలిగిన వారుగా యువత ఉండాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.


పాలిటిక్స్ గురించి యువత ఆలోచించాలి: మాధవ్

2047కి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. స్వతంత్ర సేనానుల కల సాకారం చేయడానికి కృషి చేయాలన్నారు. దేశ రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సూచించారు. ప్రధాని మోదీ ప్రయాణం అందరికీ ఒక స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. ఎయిర్, రోడ్, వాటర్ కనెక్టివిటీలను మోదీ అభివృద్ధి చేశారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అందరికీ సామాజిక అభివృద్ధి కలిగించారని మాధవ్ అన్నారు.


విలేజ్ ఇంటిలిజెన్స్(వీఐ).. ఏఐ కంటే బలమైనది: సుజనా చౌదరి

ఈ రోజుల్లో యువత ప్రతి అంశంలో చాలా ముందుంటున్నారని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. VI అంటే విలేజ్ ఇంటిలిజెన్స్‌ అని.. AI కంటే చాలా బలమైనదని చెప్పుకొచ్చారు. HI అంటే హ్యూమన్ ఇంటిలిజెన్స్, PI అంటే పొలిటికల్ ఇంటిలిజెన్స్‌.. వీటిలోనూ మనం అద్భుతంగా ఉన్నామని చెప్పారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని 2047 నాటికి పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని అంటున్నారన్నారు. విద్యార్థులు పొలిటికల్ లీడర్స్ అయ్యేందుకు ఆలోచన చేయాలని తెలిపారు. ఆర్థిక అభివృద్ధి అంశాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పారు. యువత పబ్ కల్చర్ కంటే ఆరోగ్యవంతమైన అంశాలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.


ఇవి కూడా చదవండి...

దారుణం.. భార్యను చంపి గోదావరి నదిలో పడేసి.. ఆపై

ఏఈఈ నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి... ప్రలోభాలు నమ్మొద్దన్న మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 04:13 PM