ఏఈఈ నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి... ప్రలోభాలు నమ్మొద్దన్న మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:36 PM
వివిధ విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
అమరావతి, ఆగస్టు 22: వివిధ విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. 629 ఉద్యోగాలకు లక్షమంది పైగా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా రేపు(ఆదివారం) నిర్వహిస్తున్న పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెప్పుడు మాటలు, ప్రలోభాలు ఎవ్వరూ నమ్మొద్దన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా నిరుద్యోగుల్ని మోసాగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎవరైనా ప్రలోభ పెడుతుంటే అభ్యర్థులు కూడా నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. ఖాళీల భర్తీ ద్వారా విద్యుత్ ఉద్యోగ అవకాశాలు కల్పించటంతోపాటు విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. 629 ఏఈఈల నియామకం ద్వారా విద్యుత్ రంగంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
దారుణం.. భార్యను చంపి గోదావరి నదిలో పడేసి.. ఆపై
Read Latest AP News And Telugu News