Share News

దారుణం.. భార్యను చంపి గోదావరి నదిలో పడేసి.. ఆపై

ABN , Publish Date - Aug 22 , 2026 | 02:51 PM

కాకినాడ జిల్లాలోని యానాంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యను కట్టుకున్న భర్తే అతికిరాతకంగా చంపేసి గోదావరి నదిలో పడేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

దారుణం.. భార్యను చంపి గోదావరి నదిలో పడేసి.. ఆపై
Yanam News

కాకినాడ జిల్లా, ఆగస్టు 22: జిల్లాలోని యానాంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యను కట్టుకున్న భర్తే అతికిరాతకంగా చంపేసి గోదావరి నదిలో పడేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భార్యను హతమార్చి ఆపై ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.


ఆరేళ్ల క్రితం చెక్క అప్పారావు, రేఖ(26) ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి అనంతరం కొద్దిరోజులు తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తరచూ గొడవ పడటంతో ఇరువర్గాల పెద్దలు ఇద్దరినీ ఒప్పించి రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్యా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆగ్రహంతో భార్యను అప్పారావు హత్య చేసి యానాం గణపతి నగర్ సమీపంలోని గోదావరి నదిలో పడేశాడు.


అనంతరం ఉదయం నుంచి భార్య రేఖ కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు పిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు.. అప్పారావును విచారించగా భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోదావరి నదిలో రేఖ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 03:23 PM