Share News

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం..

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:27 AM

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారంతో యూనియన్ బ్యాంక్ నుంచి రూ.24 కోట్లను నిందితులు కొట్టేశారు.

విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం..
Vijayawada Corporate Fraud

విజయవాడ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారంతో యూనియన్ బ్యాంక్ నుంచి రూ. 24 కోట్లను నిందితులు కొట్టేశారు. యూనియన్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకున్న డబ్బుతో ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేయకుండా లోన్ మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా నిందితులు మళ్లించారు. ఈ క్రమంలో ఆ బ్యాంకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 23.85 కోట్లకు బదులుగా కేవలం రూ.25 లక్షల నిల్వలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.


ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి సీబీఐకి యూనియన్ బ్యాంక్ ఏజీయం శ్రీకాంత్ పాత్రో ఫిర్యాదు చేశాడు. యూనియన్ బ్యాంక్ నుంచి ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోన్ తీసుకునట్లు ఆ బ్యాంక్ ఏజీయం తెలిపారు. బ్యాంక్ లోన్ రాగానే ఆరు నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్ల రాజీనామా చేశారు. ఈ కేసులో నిందితులుగా డైరెక్టర్లు కోట భానుప్రసాద్, కోట శ్రావణి, కోట పృథ్వీ వెంకటతేజ, కోట రాహుల్ సాయి బాలాజీతో పాటు బ్యాంకు ఉద్యోగులను సీబీఐ అధికారులు చేర్చారు.


వార్తలు కూడా చదవండి...

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 11:48 AM