Share News

వందేభారత్‌ రైలులో అగ్నిప్రమాదం.. స్పందించిన రైల్వే శాఖ

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:48 PM

విజయవాడ రైల్వేస్టేషన్‌లో ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ రైలులో సీ4 కోచ్‌లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే కోచ్ నుంచి దిగిపోయారు. రైల్వేస్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి.. మంటలను అదుపు చేశారు.

వందేభారత్‌ రైలులో అగ్నిప్రమాదం.. స్పందించిన రైల్వే శాఖ

విజయవాడ, సెప్టెంబర్ 23: స్థానిక రైల్వేస్టేషన్‌లో నర్సాపూర్ నుంచి చెన్నై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని సీ4 కోచ్‌లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే కోచ్ నుంచి దిగిపోయారు. రైల్వేస్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి.. మంటలను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లు అయింది. విజయవాడ రైల్వేస్టేషన్‌లో వందే భారత్ రైలులో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20678) విజయవాడ చేరుకుందని తెలిపింది. అదే సమయంలో సీ4 కోచ్‌లో హాట్ యాక్సిల్ ఉన్నట్లు సిబ్బంది గుర్తించారని వివరించింది.


రైల్వే సిబ్బంది వెంటనే ఆ కోచ్ వద్దకు చేరుకున్నారు. సాంకేతిక, భద్రతా బృందాలను అప్రమత్తం చేసి.. తక్షణం అవసరమైన చర్యలు చేపట్టారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రయాణికులకు వేచి ఉండే సౌకర్యం, తాగునీరు, ఆహారంతోపాటు సహాయం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామంది. ఈ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ రైలు ఏర్పాటు చేశామని వివరించింది. ఈ అంశాన్ని రైల్వే అధికారులు పర్యవేక్షిస్తున్నారని చెప్పింది. అలాగే ప్రయాణికులకు అవసరమైన సహాయక చర్యలు అందిస్తున్నారని రైల్వే శాఖ పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

ఏపీ హైకోర్టులో ఐదుగురు జడ్జిలకు శాశ్వత హోదా.. కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఓకే

విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన యంత్రాంగం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 07:54 PM