Share News

గాదె సాయికృష్ణ కేసులో వేగం పెంచిన సిట్.. మరో నిందితుడి కోసం ముమ్మర గాలింపు

ABN , Publish Date - Aug 02 , 2026 | 02:07 PM

గాదె సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సురేశ్ ఆచూకీ తెలపాలంటూ గుర్తులతో ప్రకటన విడుదల చేశారు.

గాదె సాయికృష్ణ కేసులో వేగం పెంచిన సిట్.. మరో నిందితుడి కోసం ముమ్మర గాలింపు
Gade Sai Krishna Case

విజయవాడ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ కేసులో (Gade Sai Krishna Case) సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సురేశ్ ఆచూకీ తెలపాలంటూ ఆయా గుర్తులతో ఓ ప్రకటన విడుదల చేశారు. పేరు: గులివిందల సురేశ్ (A4), తండ్రి పేరు: ఆదినారాయణ, చిరునామా: సత్యనారాయణపురం, విజయవాడ, వయస్సు: 40 సంవత్సరాలు, ఎత్తు: సుమారు 5 అడుగులు 8 అంగుళాలు అని ఈ ప్రకటనలో తెలిపారు. సాయికృష్ణ కేసు నమోదైనప్పటి నుంచి నిందితుడు ఉద్దేశపూర్వకంగా పరారీలో ఉంటూ పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకుంటున్నారని సిట్ అధికారులు తెలిపారు. అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.


నిందితుడి ప్రస్తుత ఆచూకీ, సంచార ప్రాంతాలు లేదా అతడు తలదాచుకున్న ప్రదేశానికి సంబంధించి ఏదైనా విశ్వాసనీయ సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలపాలని విజ్ఞప్తి చేశారు. చిన్న సమాచారం కూడా నిందితుడిని అరెస్టు చేయడంలో కీలకంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. పరారీలో ఉన్న నిందితుడికి తెలిసి ఆశ్రయం కల్పించడం, దాచిపెట్టడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అలాంటి వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసుల అత్యవసర సేవల నంబర్లు 100/112కు వెంటనే తెలపాలని సూచించారు. అతని సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని సిట్ అధికారులు పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 03:24 PM