‘పోలీసులు చంపకపోతే నేనే చంపుతా’.. రాప్తాడు ఉన్మాదికి చికిత్సపై బాధితురాలి ఫ్రెండ్ ఫైర్
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:27 PM
రాప్తాడులో విద్యార్థినిపై అత్యంత పాషవికంగా దాడి చేసిన నిందితుడికి చికిత్స అందించడంపై ఆమె ఫ్రెండ్ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన స్నేహితురాలిపై దారుణంగా దాడి చేసిన నిందితుడికి చికిత్స ఎలా చేస్తారని ప్రశ్నించింది.
అనంతపురం, నవంబర్ 2: రాప్తాడులో విద్యార్థినిపై అత్యంత పాషవికంగా దాడి చేసిన నిందితుడికి చికిత్స అందించడంపై ఆమె స్నేహితురాలు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన స్నేహితురాలిపై దారుణంగా దాడి చేసిన నిందితుడికి చికిత్స ఎలా చేస్తారని.. పోలీసులు చంపకపోతే తానే చంపుతానంటూ ఫైర్ అయ్యింది. ఇలాంటి నిందితులకు ట్రీట్మెంట్ ఇస్తే తమలాంటి వారి పరిస్థితి ఏంటని బాలిక ప్రశ్నించింది. పోలీసులే ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారని తెలిసినప్పుడు బాధేసిందంటూ ఆవేదన చెందింది.
ఉన్మాదిని అక్కడే చంపేసి పాతేసి ఉంటే సంతోషించేవాళ్లమని బాలిక పేర్కొంది. చికిత్స అందించకుండా నిందితున్ని చంపేస్తేనే న్యాయం జరిగినట్లని తెలిపింది. ఉదయం 10:30 గంటల సమయంలో విద్యార్థులంతా క్లాసులో ఉన్నప్పుడు తన స్నేహితురాలిపై ఒక్కసారిగా రంపంతో వచ్చి దాడి చేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. ఆస్పత్రిలో అతడికి చికిత్స అందించకూడదని బాధితురాలి స్నేహితురాలు డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి...
రాప్తాడు నిందితుడి హెల్త్ అప్డేట్.. కుడి కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్న వైద్యులు
ప్రకృతి విపత్తులకు అనుగుణంగా పంటల బీమా జరగాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News