ప్రకృతి విపత్తులకు అనుగుణంగా పంటల బీమా జరగాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:02 PM
పంటల బీమాకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో 22, రబీలో 16 రకాల పంటలకు బీమా కల్పించినట్టు ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.
అమరావతి, నవంబర్ 2: పంటల బీమాకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్‌లో 22, రబీలో 16 రకాల పంటలకు బీమా కల్పించినట్టు ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ప్రకృతి విపత్తులు, వాతావరణానికి అనుగుణంగా పంటల బీమా జరగాలని సీఎం సూచించారు. వేరుశనగ, పత్తి, టమోట లాంటి వాణిజ్య పంటలకు బీమా చేసినట్టు బీమా కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు.
పంటల బీమాతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులు ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కోకుండా పంటల బీమా చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఖరీఫ్ పంట పూర్తవుతున్న నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీలో మనోవేదనకు గురయ్యా.. ఏపీలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ పెడతా: విజయసాయి
రాప్తాడు నిందితుడి హెల్త్ అప్‌డేట్.. కుడి కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్న వైద్యులు
Read Latest AP News And Telugu News