కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ: పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:29 PM
కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.
విజయవాడ, ఆగస్టు 15: కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పీవీఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చినా వందేమాతర గీతం ఆలపించడం ఆగిపోయిందని.. ఇవాళ ప్రధాని మోదీ వందేమాతర గీతం పూర్తిగా ఆలపించారని తెలిపారు. కొందరు సంకుచిత మతతత్వ ఆలోచనతో ఏ మాతకీ వందనం చెప్పకుండా భీష్మించుకుని కూర్చున్నారని మండిపడ్డారు.
అధికారికంగా దేశం మొత్తం వందేమాతర గీతం పూర్తిగా ఆలపించారని మాధవ్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్ భారత్ నినాదం తీసుకొచ్చారని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో టెర్రరిస్టు, మావోయిస్టు కార్యకలాపాలు లేకుండా చేశారని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News