Share News

విశిష్ట సోమవారాన్ని పురస్కరించుకుని మహాశివుడికి లోకేశ్ దంపతుల రుద్రాభిషేకం

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:43 PM

ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

విశిష్ట సోమవారాన్ని పురస్కరించుకుని మహాశివుడికి లోకేశ్ దంపతుల రుద్రాభిషేకం
Nara Lokesh

హైదరాబాద్/అమరావతి, జూన్ 15: ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఈ రోజు(సోమవారం) హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశిష్ట సోమవారాన్ని పురస్కరించుకుని మహాశివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రుత్వికుల వేదమంత్రోచ్ఛారణల నడుమ లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు.


Nara lokesh

శివారాధనతో పాటు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం లోకేశ్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా సంక్షేమం సహా రాష్ట్ర సుభిక్షం కోసం మహాశివుడిని ప్రార్థించారు. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం ప్రత్యేక హారతులు, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు.

Nara lokesh


ఇవి కూడా చదవండి...

యూఎన్ హాబిటాట్‌తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ

విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 15 , 2026 | 05:06 PM