Share News

సింగపూర్ పర్యటన.. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:11 PM

సింగపూర్‌ పర్యటనలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించారు.

సింగపూర్ పర్యటన.. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు
CM Chandrababu Naidu

సింగపూర్/అమరావతి, జూన్ 15: సింగపూర్‌ పర్యటనలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం వివరించారు. తొలిరోజు పర్యటనలో భాగంగా వైసీహెచ్‌(YCH) లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై YCH గ్రూప్‌తో చర్చలు జరిపారు. ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీకి 1,000 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం ఉందని.. లాజిస్టిక్స్ పరంగా అనేక అనుకూలతలు ఉన్నాయని తెలిపారు.


CM Chandrababu Naidu

హైవేలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే కనెక్టివిటీ ఉందని సీఎం చెప్పారు. లాజిస్టిక్స్ వ్యయం తగ్గించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. హార్టికల్చర్‌పై లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నామని.. ఆక్వాకల్చర్‌లో నంబర్‌‌వన్‌గా ఉన్నామని వివరించారు. ఆహార ఉత్పత్తులకు వాల్యూఎడిషన్ ద్వారా ఎగుమతులకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఏపీలో అపార అవకాశాలున్నాయని... ప్రొడక్షన్‌లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. ‘ఏపీని సందర్శించండి... రాష్ట్రంలో ఉన్న పాలసీలు, అనుకూలతలు చూసి పెట్టుబడులు పెట్టండి’ అంటూ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.


ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగం.. గూగుల్ క్లౌడ్‌ సహకారాన్ని కోరిన సీఎం

గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై గూగుల్ క్లౌడ్‌ సహకారాన్ని సీఎం కోరారు.


రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత శక్తిమంతం చేసేందుకు ఆధునిక క్లౌడ్ సాంకేతికతల వినియోగంపై చర్చించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో యువతకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఏఐ స్కిల్లింగ్, క్లౌడ్ సర్టిఫికేషన్ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ విజయాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సంజీవని ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.


ఇవి కూడా చదవండి...

మోదీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతోంది: సీఎం చంద్రబాబు

తెలంగాణ విభజనకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 15 , 2026 | 05:10 PM