MP Kesineni Sivanath: కిడ్నీ బాధితుల సంక్షేమానికి అండగా కేశినేని ఫౌండేషన్ ముందడుగు..
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:58 PM
పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు..
ఎన్టీఆర్ జిల్లా, జనవరి10(ఆంధ్రజ్యోతి): కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సరైన పోషణే అత్యంత కీలకమని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఏ కొండూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కిడ్నీ బాధితులు, డయాలసిస్ పేషంట్లకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో ఎంపీ శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఆర్డీఓ మాధురి, కూటమి నేతలు పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధిగ్రస్థులకు నెల రోజులకు సరిపోయే విధంగా మరమరాలు, నువ్వుల ఉండలు, అటుకులు, జొన్న పిండితో చేసిన పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ లక్ష్మీషా, ఆర్డీఓ మాధురితో కలిసి ఎంపీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడారు. పౌష్టికాహారం అందించడం ద్వారా చికిత్సకు తోడ్పాటుగా ఉండడంతో పాటూ ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెలా పౌష్టికాహారం పంపిణీ చేస్తామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News