జగన్ మావిగన్ వ్యాఖ్యలపై ఎంపీ శివనాథ్ రియాక్షన్
ABN , Publish Date - Apr 04 , 2026 | 03:26 PM
మావిగన్ అంటూ నోటికొచ్చినట్లుగా జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ కేవినేని శివనాథ్ తెలిపారు. ఇటువంటి కామెడీ పీస్‌లు రాష్ట్ర రాజకీయాలలో పనికిరారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 4: మాజీ సీఎం, వైసీపీ అధినేత నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మావిగన్ వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)(MP Kesineni Sivanath) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ కామెడీ పీస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటే ఒక మహత్తర ప్రదేశమన్నారు. జగన్ రాజధానిని కామెడీ పీస్‌గా మార్చారంటూ మండిపడ్డారు. మావిగన్ అంటూ నోటికొచ్చినట్లుగా జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి కామెడీ పీస్‌లు రాష్ట్ర రాజకీయాలలో పనికిరారన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం వైసీపీకి మింగుడు పడటం లేదని అన్నారు.
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందే సమయంలో తాను పార్లమెంట్‌లో సభ్యుడుగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నట్లు ఎంపీ తెలిపారు. అమరావతి శాశ్వత రాజధాని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో జగన్, వైసీపీ కామెడీ పీస్‌లు తప్ప అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషిని దేశంలో అన్ని పార్టీల నాయకులు కొనియాడుతున్నారని తెలిపారు. వైసీపీ వంటి పార్టీ త్వరలో రాష్ట్రంలో కనుమరుగవడం ఖాయమని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
కుట్రతోనే తెరపైకి మావిగన్ పేరు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
ఆనాడు మావిగన్ గుర్తు రాలేదా.. జగన్‌కు కోటంరెడ్డి ప్రశ్న
Read Latest AP News And Telugu News