ఆనాడు మావిగన్ గుర్తు రాలేదా.. జగన్‌కు కోటంరెడ్డి ప్రశ్న
ABN , Publish Date - Apr 04 , 2026 | 02:31 PM
రాష్ట్రంలో మనుగడ లేదన్న నిరాశ, నిస్పృహలోకి జగన్ వెళ్లారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదా అని జగన్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు.
నెల్లూరు, ఏప్రిల్ 4: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(MLA Kotam Reddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రస్తుతం ‘మావిగన్.. మావిగన్’ అంటూ గావుకేకలు వేస్తున్నారని.. సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. దేశంలో ఒక్క వైసీపీ తప్పించి.. అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో అమరావతి బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందని తెలిపారు. రాష్ట్రంలో మనుగడ లేదన్న నిరాశ, నిస్పృహలోకి జగన్ వెళ్లారని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
‘జగన్.. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా.. మీరో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.. విచక్షణతో మాట్లాడండి. మావిగన్.. మావిగన్ అంటూ మాట్లాడితే కేఏ పాల్‌కు మీకు తేడా ఉండదు. రాజకీయాల్లో కేఏ పాల్ స్థానాన్ని జగన్ భర్తీ చేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర, జాతీయ మీడియా అవినీతికి పాల్పడుతున్నాయని జగన్ వ్యాఖ్యలు చేస్తే.. ఒక్క జర్నలిస్ట్ కూడా స్పందించలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రాజధాని పనులు.. వారంతా చరిత్రలో భాగస్వాములే: సీఎం చంద్రబాబు
కుట్రతోనే తెరపైకి మావిగన్ పేరు.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
Read Latest AP News And Telugu News