Share News

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:45 AM

వైసీపీని ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం పొందడం చూసి ఓర్వలేక జగన్ ‘మావిగన్’ అని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది కలే: భాను ప్రకాశ్ రెడ్డి
Bhanu Prakash Reddy

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓ విధంగా.. ఓడిపోయిన తర్వాత మరో విధంగా ఉండే వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు గెలుపు ఓటములు సర్వసాధారణమన్నారు. వైసీపీని ఏపీ ప్రజలు చీదరించుకున్నారని.. ఓడిపోయిన తర్వాత రాష్ట్రంపై జగన్ ద్వేషం పెంచుకున్నారని అన్నారు. బంగారు పంటలు పండే భూములను రైతులు.. రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారని తెలిపారు. అలాంటి రైతుల కళ్లల్లో కన్నీళ్లు పెట్టించి జైల్లో వేసి జగన్ రాక్షసానందం పొందారని విమర్శించారు.


ఏపీని అభివృద్ధి ప్రదేశ్‌గా ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తోందని భాను ప్రకాశ్ వెల్లడించారు. పార్లమంట్ ఉభయసభల్లో అమరావతి బిల్లుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం తెలిపారని.. దాన్ని ఓర్వలేక జగన్ ‘మావిగన్’ అని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు 2024లో ఓటు అనే గన్ ఆయుధంతో వైసీపీని పేల్చితే.. 164 సీట్లలో పిట్టలుగా లేచిపోయారని.. కేవలం 11 సీట్లు మాత్రం వచ్చాయని అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు11 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రశాంత వాతావరణంలో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని చెప్పుకొచ్చారు.


జగన్ చేష్టలను ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని భానుప్రకాశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని అది అమరావతి అని తేల్చిచెప్పారు. మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చేది లేదు.. చూసేది లేదన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఒక కామెడీ యాక్టర్‌గా మిగిలిపోయారని.. ఆ వీడియోలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. మాజీ సీఎం అపరిచితుడిగా మారిపోయారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళుతోందన్నారు.


2019లో వైసీపీ ఏపీని అప్పుల ప్రదేశ్‌గా మార్చిందని భాను ప్రకాశ్ విరుచుకుపడ్డారు. జగన్‌, వైసీపీకి ఏపీ ప్రజలు విడాకులు ఇచ్చారన్నారు. అమరావతి రైతుల శాపం జగన్‌కు తగిలిందన్నారు. ఏపీలో వైసీపీ ఫ్యాన్‌ తిరగదని.. కామెడీలతో జగన్ శేష జీవితం పూర్తవుతుందని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి చేతనైతే జగన్‌ చేతిలో భగవద్గీత పెట్టాలని సవాల్ విసిరారు. ఇంట్లో దేవాలయాల సెట్లు వేసుకుని.. కనీసం తీర్థం కూడా తీసుకోరంటూ జగన్‌పై భాను ప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిపై జగన్‌కు కక్ష, అసూయ పోలేదు: ఎంపీ అప్పలనాయుడు

దారుణం... వివాహితపై ఇంటి యజమాని వికృత చేష్టలు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2026 | 12:51 PM