Share News

‘పోలీస్ మామలు’ అంటూ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో సభ్యులు షాక్..

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:17 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవటానికి కొందరు వాహనదారులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అందులో వచ్చే సమాచారం ఆధారంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.

‘పోలీస్ మామలు’ అంటూ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో సభ్యులు షాక్..
Police Mamalu WhatsApp group

హైదరాబాద్, ఏప్రిల్ 3: పెద్దపల్లి జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవటానికి కొందరు వాహనదారులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అందులో వచ్చే సమాచారం ఆధారంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే, ట్రాఫిక్ ఎస్‌ఐ గ్రూప్‌లోకి ఎంట్రీ ఇవ్వటంతో సభ్యులు షాక్ అయ్యారు. భయంతో గ్రూపు నుంచి ఎగ్జిట్ అయ్యారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.


పోలీసులు అతడి ఫోన్ చెక్ చేయగా ‘పోలీస్ మామలు’ అనే వాట్సాప్ గ్రూప్ కనిపించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది వాహనదారులు కలిసి ఆ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో వచ్చే సమాచారం ఆధారంగా సభ్యులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలనుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ ఎస్ఐ.. ఆ వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులకు షాక్ ఇచ్చే పని చేశారు. ఆ గ్రూపులో జాయిన్ అయ్యారు. తమ గ్రూప్‌లో ఎస్ఐ జాయిన్ అయ్యాడని తెలియగానే సభ్యులందరూ భయపడిపోయారు.


వెంటనే గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎస్ఐ ఆ గ్రూప్‌లో ఓ వీడియో మెసేజ్ పెట్టారు. ఆ వీడియో మెసేజ్‌లో.. ‘మీ నంబర్లు అన్నీ సేవ్ చేసుకున్నాను. త్వరలో అందరికీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను’ అని అన్నారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

ఇరాన్‌లో 3,500 మంది.. ఇజ్రాయెల్‌లో 19 మంది.. పశ్చిమాసియాలో భారీ ప్రాణ నష్టం..

Updated Date - Apr 04 , 2026 | 01:58 PM