మొవ్వ ఎంపీపీ ఎన్నికలో అనూహ్య పరిణామం
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:04 PM
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ ఎంపీపీ ఎన్నిక అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. టీడీపీ నుంచి అయ్యంకి ఎంపీటీసీగా గెలుపొందిన తాత రత్న మాణిక్యమ్మను ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ నాయకత్వం తొలుత నిర్ణయించింది.
కృష్ణా, నవంబర్ 19: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ ఎంపీపీ ఎన్నిక అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. టీడీపీ నుంచి అయ్యంకి ఎంపీటీసీగా గెలుపొందిన తాత రత్న మాణిక్యమ్మను ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ నాయకత్వం తొలుత నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఎంపీపీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
మొవ్వ మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 10 స్థానాల్లో, జనసేన రెండు స్థానాల్లో విజయం సాధించింది. చెరో స్థానంలో బీజేపీ, వైసీపీ గెలుపొందగా.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ క్రమంలో కూచిపూడి సెగ్మెంట్ నుంచి గెలుపొందిన పోలన సుష్మకు ఎంపీపీగా బీజేపీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఈ అనూహ్య పరిణామంతో టీడీపీ నేతలు అవాక్కైన పరిస్థితి. బీజేపీకి ఎంపీపీ స్థానం ఖరారు కావడంతో తెలుగుదేశం శ్రేణులు కంగుతిన్నారు. దీంతో టీడీపీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన తాతా రత్న మాణిక్యమ్మ రాత్రికి రాత్రే బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో మొవ్వ ఎంపీపీ స్థానం బీజేపీకి దక్కే పరిస్థితి ఏర్పడింది. నేడు జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో మండల అధ్యక్షురాలిగా మాణిక్యమ్మను ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకున్నారు.
ఇవి కూడా చదవండి...
పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం
Read latest AP News And Telugu NEws